: సరికొత్త ఫోన్లతో మార్కెట్లోకి దూసుకొస్తున్న జియో.. ఈ దెబ్బతో స్మార్ట్ ఫోన్ల మార్కెట్ కుదేలు!


రిలయన్స్ జియో.. దేశంలో ఇప్పుడీ పేరే సంచలనం. వెల్కమ్ ఆఫర్ తో దేశీయ టెలికం మార్కెట్ ను షేక్ చేసి సంచలనం సృష్టించిన జియో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను షేక్ చేసేందుకు దూసుకొస్తోంది. ఇందులో భాగంగా 4జీపై పనిచేసే ఫీచర్ ఫోన్లను ఈ త్రైమాసికంలోనే విడుదల చేయాలని నిర్ణయించింది. రూ.999-రూ.1499 మధ్య ధరతో లభ్యమయ్యే ఈ ఫోన్లు కనుక మార్కెట్లోకి వస్తే స్మార్ట్ ఫోన్ల మార్కెట్ కుప్పకూలడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.  ఈ ఫోన్లు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఫీచర్ ఫోన్లు ఉపయోగిస్తున్నవారు వీవోఎల్టీఈకి అప్ గ్రేడ్ కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

జియో విడుదల చేయనున్న 4జీ ఫీచర్ ఫోన్ లో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లో ఉండే దాదాపు అన్ని ఆప్షన్లు ఉండనున్నాయి. ముందు, వెనక కెమెరాలు, చాట్, లైవ్ టీవీ ఆన్ డిమాండ్ వంటి యాప్ లు కూడా ఉంటాయి. కాగా ప్రస్తుతం వీవోఎల్టీఈ సదుపాయం ఉన్న స్మార్ట్ ఫోన్ లు తక్కువలో తక్కువగా రూ.3500 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

  • Loading...

More Telugu News