: టాటా సన్స్ కొత్త చైర్మన్ చంద్రశేఖరన్ గురించిన ఆసక్తికర విషయాలు!
టాటా సన్స్ కొత్త చైర్మన్ గా నటరాజన్ చంద్రశేఖరన్ నియమితులైన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీసీఎస్ సీఈవో, ఎండీగా వ్యవహరిస్తున్న ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.
* చంద్రశేఖరన్ ను ఎక్కువగా ‘చంద్ర’ అని సంభోదిస్తుంటారట.
* తమిళనాడు తిరుచ్చిలోని ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్స్ లో ఆయన పీజీ చేశారు. ఆ తర్వాత 1987 లో టీసీఎస్ లో చేరారు.
* మంచి వ్యాపారవేత్త అయిన ఆయనలో ఫ్రొపెషనల్ ఫొటోగ్రాఫర్ కూడా ఉన్నారట.
* మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆయన లాంగ్ డిస్టెన్స్ రన్నర్ కూడా. ముంబయి, న్యూయార్క్, టోక్యో, బోస్టన్, ఆమ్ స్టర్ డ్యాం, బెర్లిన్ తదితర చోట్ల నిర్వహించిన పలు మారథాన్లలో ఒకప్పుడు ఆయన పాల్గొన్నారట.
* 2009 నుంచి టీసీఎస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న చంద్రశేఖరన్, మిస్త్రీని తొలగించాక బోర్డు డైరెక్టర్ గా ఆయన నియమితులయ్యారు.