: మా పార్టీలో ఉన్న హ్యాబిట్ ఏంటంటే.. ‘సాక్షి’ పేపర్ చదవద్దంటారు!: మంత్రి అయ్యన్నపాత్రుడు


తమ పార్టీ వాళ్లు సాక్షి పేపర్ చదవద్దంటారని ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్శిటీ ప్లాటినమ్ జూబ్లీహాల్ లో ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరీ, క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘మా  పార్టీలో ఉన్న హ్యాబిట్ ఏంటంటే.. సాక్షి పేపర్ చదవద్దంటారు. ఈనాడు, జ్యోతి చదవమంటారు. ఈనాడు, జ్యోతి మనకు ఫేవర్ గానే రాస్తారు. నా ఉద్దేశంలో.. కంప్లసరి, సాక్షి చదవాలి మనం. మిగతా వాళ్ల ఉద్దేశం ఏంటో నాకు తెలియదు కానీ, సాక్షి పేపర్ లో వాస్తవాలు ఉండొచ్చు, వాస్తవాలు ఉండకపోవచ్చు. వాస్తవాలు ఉన్నప్పుడు.. మన పరిపాలనా విధానాలను  సరిదిద్దుకునే సందర్భాలు కూడా ఉంటాయి మాకు’ అని ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మూర్తి, ఏయూ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. 

  • Loading...

More Telugu News