: టాటా సన్స్ నూతన చైర్మన్ గా నటరాజన్ చంద్రశేఖరన్
టాటా సన్స్ గ్రూపుకు నూతన చైర్మన్ గా నటరాజన్ చంద్రశేఖరన్ ను నియమించారు. టాటా సన్స్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా, టీవిఎస్ గ్రూప్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, బైన్ కేపిటల్ అమిత చంద్ర, రోనన్ సేన్, లార్డ్ కుమార్ భట్టాచార్యతో కూడిన సభ్యుల కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారికంగా త్వరలోనే ఒక ప్రకటన వెలువడనుంది. కాగా, 2009 నుంచి టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న చంద్రశేఖరన్ 1987లో ఆ సంస్థలో చేరారు.