: ఈ మాట మాట్లాడుతున్నందుకు వినాయక్ గారు క్షమించాలి!: అల్లు అరవింద్


పదేళ్ల తర్వాత మళ్లీ నటించిన చిరంజీవిని చూడాలనే అభిమానం ప్రభావం ఈ చిత్రంపై ఎక్కువగా ఉందని అల్లు అరవింద్ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ లో ఆయన మాట్లాడుతూ,‘ చిరంజీవి ఎలా ఉన్నారు? ఎలా చేస్తారు? ఆయనని ఒక నటుడిగా ప్రేమించిన వాళ్లందరూ చూడాలని అనుకుంటారు. ఇలా మాట్లాడుతున్నందుకు వీవీ వినాయక్ గారు క్షమించాలి... ఈ చిత్రం సబ్జెక్టు, మిగతా విషయాల ప్రభావం కన్నా చిరంజీవిగారి ప్రభావం వల్లే ఈ సినిమాకు ఊహించని స్పందన వచ్చింది. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి విపరీతమైన స్పందన వచ్చింది. మిడ్ వీక్ లో ఈ చిత్రం రిలీజు అయినప్పటికీ యూఎస్ లో భారీగా కలెక్షన్లు రాబట్టింది’ అని అరవింద్ పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News