: అందుకే, చిరంజీవి సినిమాని ముందుగా విడుదల చేశాం!: నిర్మాత అల్లు అరవింద్


‘ఖైదీ నంబర్ 150’వ చిత్రాన్ని చెప్పిన తేదీ కన్నా ముందుగా ఎందుకు విడుదల చేశామనే విషయమై చిరంజీవి బావమరిది, నిర్మాత అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. ‘ఖైదీ నంబర్ 150’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అధిక సంఖ్యలో హాజరైన చిరంజీవి అభిమానులను చూసి ఆశ్చర్యపోయామని అన్నారు. 'చిరంజీవి ఫంక్షన్ కు వచ్చిన అమోఘమైన ఆ స్పందన చూసి, 11వ తేదీన ఈ చిత్రం విడుదల చేసినా ఫర్వాలేదని అనుకున్నాం. అయితే, మమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా ఈ చిత్రానికి స్పందన వచ్చింది. రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సాధించింది' అన్నారు. సాధారణంగా శుక్రవారం నాడు కొత్త సినిమాను విడుదల చేస్తారని, కానీ, బుధవారం నాడు చిరంజీవి చిత్రాన్ని విడుదల చేశామని అన్నారు. చిరంజీవి సత్తా మేరకు ఈ చిత్రానికి కలెక్షన్లు ఉంటాయని అన్నారు. 

  • Loading...

More Telugu News