: 'ఖైదీ నంబర్ 150' కలెక్షన్ల వివరాలను వెల్లడించిన అల్లు అరవింద్


చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' భారీ వసూళ్లను సాధిస్తూ రికార్డులను క్రియేట్ చేస్తోందని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. తొలి రోజున రూ. 47.07 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించిందని చెప్పారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో రూ. 30కోట్ల 45వేలు వసూలు చేసిందని వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రంలో రూ. 4.70 కోట్లు కలెక్ట్ చేసిందని తెలిపారు. అమెరికాలో 1.22 మిలియన్ డాలర్లను కొల్లగొట్టిందని చెప్పారు. ఇతర దేశాల్లో 3,20,000 డాలర్లు వసూలు చేసిందని తెలిపారు. ఒడిశాలో రూ. 12 లక్షలు, తమిళనాడులో రూ. 20 లక్షలు, ఇతర రాష్ట్రాల్లో రూ. 58 లక్షలు వసూలు చేసిందని చెప్పారు.    

  • Loading...

More Telugu News