: ఉన్నతాధికారులు నా భర్తపై ఒత్తిడి తెస్తున్నారు: జవాన్ తేజ్ బహుదూర్ భార్య


బీఎస్ఎఫ్ జవాన్లకు అందించే ఆహారంలో నాణ్యత కొరవడిందంటూ ఆరోపించిన జవాను తేజ్ బహుదూర్ పై అధికారుల ఒత్తిడి మొదలైంది. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ కొందరు అధికారులు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారని తేజ్ బహుదూర్ భార్య షర్మిల ఆరోపించారు. ఆ ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పమని తనపై అధికారులు అంటున్నారని తన భర్త తనతో చెప్పారని ఆమె పేర్కొంది. కాగా, జవాన్ల కోసం తన భర్త గళమెత్తడం సబబేనని అంతకుముందు షర్మిల చెప్పడం విదితమే. తన భర్తకు మతిస్థిమితం లేదని ఉన్నతాధికారులు చేసిన వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. మతిస్థిమితం లేని వ్యక్తిని సరిహద్దులో విధులకు ఎలా పంపారని షర్మిల ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News