: 600 కోట్లు జమ చేస్తావా? లేక జైలుకు వెళతావా?: సహారా చీఫ్ కు సుప్రీంకోర్టు వార్నింగ్


ఫిబ్రవరి 6వ తేదీ లోపల రూ. 600 కోట్లను సెబీ-సహారా అకౌంట్ లో జమ చేయాలని, లేకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్ కు సుప్రీంకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ రంజన్ గొగోయ్ లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. డబ్బు చెల్లించడానికి ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని చెప్పిన సుప్రీంకోర్టు... డబ్బు చెల్లించడానికి మరింత సమయం కావాలంటూ సహారా గ్రూప్ వేసిన పిటిషన్ ను కొట్టి వేసింది. ఇప్పటి వరకు పెట్టుబడిదారులకు సహారా గ్రూపు దాదాపు రూ. 18,000 కోట్లు తిరిగి చెల్లించింది. మరో వెయ్యి కోట్లు చెల్లించాలంటూ ఆ సంస్థను ఆదేశించిన సుప్రీంకోర్టు... ఆ మొత్తాన్ని రూ. 600 కోట్లకు తగ్గించి... ఫిబ్రవరి 6 నాటికి చెల్లించాలని ఆదేశించింది. 

  • Loading...

More Telugu News