: హజ్ యాత్రకు ఇస్తున్న సబ్సిడీని రద్దు చేయండి..!: అసదుద్దీన్ ఒవైసీ
హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు ప్రభుత్వం ప్రతియేటా ఆర్థిక సాయం చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ సబ్సిడీ తొలగించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వం ముందు ఓ ప్రతిపాదన చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హజ్ యాత్రకు ఇస్తున్న సబ్సిడీని రద్దు చేసి ఆ సాయాన్ని విద్యకు ఉపయోగించాలని ఆయన విన్నవించుకున్నారు. ఆ నిధులని ప్రధానంగా బాలికల విద్య కోసం వినియోగించాలని కోరారు.