: ‘యాపిల్’కు గుడ్ బై చెప్పిన సీనియర్ ఇంజనీర్!
స్మార్ట్ ఫోన్ సంస్థ ‘యాపిల్’కు పదకొండేళ్ల పాటు సేవలందించిన సీనియర్ ఇంజనీర్ క్రిస్ ల్యాటర్న్ ఆ సంస్థకు గుడ్ బై చెప్పారు. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాలో ఆయన చేరారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో ఉపయోగించే ‘ఆటో పైలట్’ సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసే విభాగానికి హెడ్ బాధ్యతలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా, ‘యాపిల్’లో పని చేసిన కాలంలో పలు సాఫ్ట్ వేర్ల రూపకల్పనలో కీలక బాధ్యతలు నిర్వహించిన క్రిస్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలతో పోటీగా ‘స్విఫ్ట్’ ప్రోగ్రామింగ్ భాషను అభివృద్ధి చేశారు. స్విఫ్ట్’ ప్రోగ్రామింగ్ భాషలోనే యాపిల్ గ్యాడ్జెట్స్ లో పని చేసే ఐఓఎస్, ఓఎస్ఎక్స్, టీవీఓఎస్, వాచీ ఓఎస్ యాప్ లను రూపొందిస్తారు.