: గన్నవరం విమానాశ్రయం నూతన అంతర్జాతీయ టెర్మినల్ స్పెషాలిటీస్!
గన్నవరం ఎయిర్ పోర్ట్ అంతర్జాతీయ శోభను సంతరించుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, బండారు దత్తాత్రేయ, సుజనా చౌదరిలతో కలసి ఈ రోజు అంతర్జాతీయ టెర్మినల్ ను ప్రారంభించారు.
ఈ టెర్మినల్ విశేషాలేంటో ఓ సారి చూద్దాం...
- నిర్మాణానికి అయిన ఖర్చు రూ. 162 కోట్లు
- వైశాల్యం 12,642 చదరపు మీటర్లు
- 18 చెక్ ఇన్ కౌంటర్లు
- 6 బోర్డింగ్ గేట్లు
- 300 కార్లకు పార్కింగ్ సౌకర్యం
- గంటకు 500 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం
- అత్యాధునిక సీసీ కెమెరాలు, స్క్రీన్లు, మూడంచెల విధానంలో సెక్యూరిటీ
- స్థానిక సంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడేలా కొండపల్లి బొమ్మలు, కలంకారీ చిత్రాలతో టెర్మినల్ ను తీర్చిదిద్దారు.