: పాకిస్థాన్ చెరలో ఉన్న భారత జవాను క్షేమం


గత ఏడాది సెప్టెంబర్ 30న భారత్-పాక్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న భారత సైనికుడు చందు చవాన్ అనుకోకుండా నియంత్రణ రేఖను దాటి పాక్ భూభాగంలోకి ప్రవేశించాడు. దీంతో పాక్ సైన్యం అతన్ని బంధించి, తమతో పాటే తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో, చందు క్షేమంగానే ఉన్నాడని... అతడిని విడుదల చేసేందుకు పాక్ అధికారులు నిర్ణయించుకున్నారని రక్షణశాఖ సహాయ మంత్రి సుభాష్ భమ్రే తెలిపారు. చందుపై దర్యాప్తు పూర్తి కావొచ్చిందని, త్వరలోనే అతడిని విడుదల చేస్తామని భారత్ కు పాక్ తెలిపిందని చెప్పారు. చందు క్షేమంగా విడుదల అయ్యేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరో విషయం ఏమిటంటే, పాక్ లో బందీగా ఉన్న జవాన్ చందూ మంత్రి సుభాష్ భమ్రే నియోజకవర్గానికి చెందినవాడు. 

  • Loading...

More Telugu News