: ప్రకాశం జిల్లాలో దారుణం ... బాలికపై యాసిడ్ దాడి!


తన ప్రేమను అంగీకరించలేదంటూ ఓ బాలికపై ముప్ఫై ఐదు సంవత్సరాల వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడిన దారుణ సంఘటన ప్రకాశం జిల్లా వలేటివారిపాలెంలో జరిగింది. స్థానికంగా నివాసముంటున్న బాలిక (14)ను, అదే ప్రాంతానికి చెందిన అంకయ్య అనే వ్యక్తి  ప్రేమ పేరిట కొన్నాళ్లుగా వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో.. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో బాలికపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను పామూరు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాలిక  పరిస్థితి విషమంగా ఉందని, నడుము కింది భాగం మొత్తం కాలిపోయిందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.  

  • Loading...

More Telugu News