: 'శాతకర్ణి' విజయంతో హీరో నితిన్ కు కాసుల పంట
బాలకృష్ణ నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఘన విజయం సాధించడంతో... యంగ్ హీరో నితిన్ కు కాసుల పంట పండబోతోంది. ఎందుకంటే ఈ సినిమా నైజాం హక్కులను దక్కించుకుంది నితినే కాబట్టి. ఈ ఆనందాన్ని నితిన్ ఫేస్ బుక్ ద్వారా పంచుకున్నాడు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా చారిత్రాత్మక విజయం సాధించిందని పోస్ట్ చేశాడు. ఘన విజయం సాధించిన బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపాడు. దర్శకుడు క్రిష్, నటి శ్రియలతో పాటు యూనిట్ సభ్యులందరికీ అభినందనలు తెలిపాడు. వాస్తవానికి, బాలయ్య సినిమాపై నితిన్ మొదటి నుంచి కూడా భారీ అంచనాలు పెట్టుకున్నాడట. తన అంచనాలు నిజమవడంతో నితిన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.