: జల్లికట్టు నిర్వహణ కుదరదంటే దేశం విడిచి వెళ్లిపోతా!: హీరో శింబు
జల్లికట్టు నిర్వహణ కుదరదంటే తాను ఈ దేశాన్ని విడిచిపోతానంటూ తమిళ హీరో శింబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. అనాదిగా వస్తున్న తమ సంప్రదాయం ఉనికినే కోల్పోయే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. జల్లికట్టు కోసం విడివిడిగా పోరాటం చేస్తే ఫలితం ఉండదని... అందరం కలసికట్టుగా పని చేయాలని సూచించాడు. తమ సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నాడు. జల్లికట్టు కోసం తన ఇంటి ముందు పది నిమిషాలు మౌనం పాటిస్తానని చెప్పాడు.