: పెళ్లయిన తర్వాత ఉండేందుకు కొత్తింటిని పరిశీలించిన కోహ్లీ, అనుష్క


ప్రేమ పక్షులు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు ఎక్కడైనా కనపడితే చాలు, అది పెద్ద న్యూస్ అయిపోతోంది. ఇటీవల న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ను వీరిద్దరూ డెహ్రాడూన్ లో జరుపుకున్నారు. దీంతో, వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారనే వార్తలు హల్ చల్ చేశాయి. చివరకు అలాంటిదేం లేదంటూ కోహ్లీ స్వయంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తాజాగా ముంబైలోని వర్లీ ప్రాంతంలో నిన్న వీరిద్దరూ ప్రత్యక్షం అయ్యారు. '1973 వర్లీ' పేరుతో ఓంకార్ బిల్డర్స్ అత్యంత విలాసవంతంగా నిర్మిస్తున్న అపార్ట్ మెంట్లను ఈ జంట పరిశీలించింది. దీంతో, ఈ అపార్ట్ మెంట్ల నిర్మాణం పూర్తి కాగానే... ఈ జంట ఇందులోకి మకాం మార్చేయనుందనే టాక్ మొదలైంది. పెళ్లైన తర్వాత ఇక్కడే కాపురం మొదలెడతారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే, దీనిపై వీరిద్దరూ ఇంతవరకు ఎలాంటి కామెంట్ చేయలేదు. 

  • Loading...

More Telugu News