: ఈ సినిమాకి నేనూ కెప్టెనే.. బాలయ్యా కెప్టెనే.. ఆయన ప్రోత్సాహంతోనే ఇంతటి ఘనవిజయం!: క్రిష్


నందమూరి బాలకృష్ణ న‌టించిన 100 వ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఈ రోజు విడుద‌ల‌యిన సంగ‌తి తెలిసిందే. అభిమానుల‌ మంచి స్పంద‌న రావ‌డంతో ఆ సినిమా బృందం ఆనందం వ్య‌క్తం చేస్తోంది. ఈ రోజు హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ఐమ్యాక్స్ కు బాల‌య్య‌తో పాటు సినిమా ద‌ర్శ‌కుడు క్రిష్‌, న‌టి శ్రియా వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో క్రిష్‌ మాట్లాడుతూ... ‘ఇన్ని రోజులు ఇది మా టీమ్‌కి సంబంధించిన సినిమా.. ఈ రోజు విడుద‌లైంది... ఇక‌పై ఇది తెలుగుజాతి సినిమా.. ప్ర‌తి భార‌తీయుడి సినిమా’ అని వ్యాఖ్యానించాడు.
 
ఈ సినిమాకి ఇంత పెద్ద హీరో అండ ఉందని బాల‌య్య‌ను ఉద్దేశించి క్రిష్ అన్నారు. మొద‌టి నుంచి ఆయ‌న ఇస్తోన్న ప్రోత్సాహం గొప్ప‌ద‌ని తెలిపారు. బాల‌య్య త‌మ‌ని త‌న భుజాల మీద మోశారని వ్యాఖ్యానించారు. ఈ సినిమాకు ‘నేను కెప్టెన్‌నే.... ఆయ‌నా కెప్టెనే’ అని క్రిష్ అన్నారు. బాల‌య్య ప్రోత్సాహంతోనే ఈ  ఘ‌న‌ విజ‌యం సాధ్య‌మ‌యిందని చెప్పారు.

  • Loading...

More Telugu News