: ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోతే... 'మెగా' ప్రజలు అల్పులుగా మిగిలిపోతారు: వర్మ


మెగా సినిమాను, మెగా హీరోలను, మెగా అభిమానులను మరోసారి టార్గెట్ చేశాడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తెలుగు సినీ ఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకు 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా తీసుకెళ్లిందని వర్మ ప్రశంసించాడు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడం 'బాహుబలి' ప్రారంభిస్తే... దాన్ని 'శాతకర్ణి' మరింత ముందుకు తీసుకెళ్లిందని ట్వీట్ చేశారు. ఇప్పటికైనా విషయాన్ని 'మెగా' ప్రజలు అర్థం చేసుకోకపోతే... చివరకు వాళ్లు అల్పులుగా మిగిలిపోతారంటూ కామెంట్ చేశారు. 'మెగా ప్రజలు' అంటే మెగా హీరోలా? లేక మెగా అభిమానులా? అనే విషయాన్ని జనాలకే వదిలేశాడు వర్మ.

మరోవైపు, 'ఖైదీ నంబర్ 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వర్మను ఉద్దేశించి 'అక్కుపక్షి' అంటూ నాగబాబు సంబోధించడంతో వర్మ పూర్తి యాంటీగా మారారని... ఆ అక్కసుతోనే చిరు సినిమాపై ఇలాంటి కామెంట్లు చేస్తున్నాడని మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అరువు తెచ్చుకున్న కథతో సినిమాను నిర్మించారంటూ చిరంజీవి సినిమాపై వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.


  • Loading...

More Telugu News