: సోషల్ మీడియాలో జవాను చేసిన ఆరోపణల ఫలితం... జవాన్ల ఆహారానికి కొత్త మార్గదర్శకాలు
శత్రువులు దేశంలోకి చొరబడకుండా సరిహద్దుల్లో రేయింబవళ్లు కాపలా కాస్తున్న జవాన్లకు పెడుతున్న ఆహారం బాగోలేదని ఇటీవలే తేజ్ బహదూర్ యాదవ్ అనే జవాను సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఆ జవాను చేసిన ఆరోపణలను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అధికారులు కొట్టిపారేశారు. అయినప్పటికీ, బీఎస్ఎఫ్ నియంత్రణ రేఖ వద్ద కాపలా కాస్తున్న సైనికులకు తాజాగా నాణ్యమైన ఆహారం అందించడానికి నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ఇకపై జవాన్లకు అందించే ఆహారంలో ఎటువంటి నాణ్యత కొరతా ఉండబోదని తెలుస్తోంది.