: 'శాతకర్ణి' ఘన విజయం నేపథ్యంలో... వర్మ సంచలన వ్యాఖ్యలు


'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా ఘన విజయం సాధించడం పట్ల ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఈ సందర్భంగా బాలయ్యను ఆకాశానికెత్తేశాడు వర్మ. అరువు తెచ్చుకున్న కథతో తెలుగు సినీపరిశ్రమ ఖ్యాతిని తగ్గించకుండా... ఒరిజినల్ కథాంశంతో మన ఖ్యాతిని దిగంతాలకు వ్యాపింపజేసిన బాలయ్య, క్రిష్ లకు శాల్యూట్ అంటూ ట్వీట్ చేశాడు. బాలయ్యకు '100 ఛీర్స్' అంటూ అభినందించాడు. "హే క్రిష్, గౌతమీపుత్రకు వస్తున్న టాక్ కు కంగ్రాట్స్. నా అంచనా ఏ మాత్రం తప్పకుండా, ఇంత కరెక్ట్ అయినందుకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది", అంటూ క్రిష్ కు అభినందనలు తెలిపాడు. తన 100వ సినిమా విజయంతో గొప్ప సినిమాల విషయంలో... బాలయ్య 150 మెగా రెట్లు ముందడుగు వేశాడంటూ వర్మ కొనియాడాడు.

  • Loading...

More Telugu News