: ఆయన నిర్ణయం కరెక్టే!: మోదీ భార్య జశోదాబెన్


భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన సతీమణి జశోదాబెన్ అండగా నిలిచారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు విమర్శిస్తున్న తరుణంలో... ఆయన సతీమణి మాత్రం సమర్థించారు. దేశంలోని నల్లధనాన్ని వెలికి తీయడానికి నోట్ల రద్దు ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఒక ప్రైవేట్ స్కూల్ స్వర్ణోత్సవంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గ్యాస్ సబ్సిడీని డబ్బున్న వారు స్వచ్ఛందంగా వదులుకోవాలంటూ మోదీ ఇచ్చిన పిలుపు మంచి ఫలితాలను సాధించిందని... మోదీ పిలుపుతో పేద కుటుంబాల్లోని మహిళలకు చాలా మేలు జరిగిందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. చాలా మంది గ్యాస్ సబ్సిడీని వదులుకోవడంతో... దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి చాలా మేలు కలిగిందని చెప్పారు. మహిళలు స్వశక్తితో రాణించాలని... ఇందిరాగాంధీ, మాయావతి, సుష్మాస్వరాజ్ ల మాదిరి తమతమ రంగాల్లో దూసుకుపోవాలని పిలుపునిచ్చారు. 

  • Loading...

More Telugu News