: ‘ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు’... తమిళనాడు న్యాయవాదులపై సుప్రీంకోర్టు ఆగ్రహం


జల్లికట్టుపై త్వరగా తీర్పు ఇవ్వాలని కోరుతూ తమిళనాడు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన అంశంపై న్యాయ‌స్థానం ఈ రోజు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తీర్పు విషయంలో న్యాయ‌వాదులు ఇలా కోరడం స‌రికాద‌ని చివాట్లు పెట్టింది. తీర్పు ఎప్పుడివ్వాలో తమకు తెలుసని సుప్రీంకోర్టు పేర్కొంది. త‌మ‌పై న్యాయ‌వాదులు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం లేదని స్ప‌ష్టం చేసింది. తమిళనాడులో సంక్రాంతి సంద‌ర్భంగా సుమారు రెండువేల ఏళ్లుగా జల్లికట్టును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న విష‌యం తెలిసిందే. జంతుహింస అన్న కారణంగా అభ్యంత‌రం వ్య‌క్తం కావ‌డంతో 2014 మే 7వ తేదీన జల్లికట్టు క్రీడపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. అయితే, ఆ నిషేధాన్ని ఎత్తివేయాల‌ని కోరుతూ త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం విన్న‌తులు చేసుకుంటోంది.

  • Loading...

More Telugu News