: చంద్రబాబు కోసం 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా స్పెషల్ షో!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం ఈ రోజు 'గౌతమీపుత్ర శాతకర్ణి' స్పెషల్ షోను వేస్తున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ లోని ట్రెండ్ సెట్ మాల్ లో సాయంత్రం 7 గంటలకు ఈ షో వేయనున్నారు. సినిమాను చూడ్డానికి చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా తరలిరానున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు కూడా సినిమాను చూడనున్నారు. ఈ స్పెషల్ షో కోసం నందమూరి బాలకృష్ణ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లనున్నారు. మరోవైపు, 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో.. ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. విజయవాడలో అభిమానుల సంబరం అంబరాన్ని తాకుతోంది.