: ‘ఖైదీ నంబర్ 150’ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేసిన ‘కత్తి’ దర్శకుడు మురుగదాస్!
మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల తరువాత మళ్లీ ఖైదీ నంబర్.150లో హీరోగా నటించిన విషయం తెలిసిందే. దర్శకుడు మురుగదాస్ తమిళంలో తీసిన ‘కత్తి’ సినిమా మూల కథతో వి.వి వినాయక్ ఈ సినిమాను తీశాడు. అయితే, ఈ సినిమా చూసిన మురుగదాస్ అసహనం వ్యక్తం చేశాడట. అందుకు మంచి కారణమే ఉంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నాడు. ఈ సినిమా చూసిన అనంతరం ఆయన స్పందిస్తూ.. సినిమా అంతా బాగానే ఉందని చెప్పినా, కొన్ని సీన్లపై మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశాడు.
సాధారణంగా తాను తీసే సినిమాలో కొన్ని విలువలు ఉండాలని కోరుకుంటాడు మురుగదాస్. తన చిత్రాల్లో ఆల్కహాల్ సీన్లు దాదాపుగా ఉండకుండా చూసుకుంటాడు. ఈ విధానాన్ని పాటిస్తూ వస్తున్న ఆయన సినిమాల్లో కనీసం విలన్ కూడా ఆల్కహాల్ తీసుకోడు. కేవలం టీ, కాఫీలను మాత్రమే ఆయన సినిమాల్లో విలన్లు తాగుతారు. అలాంటిది తాను కత్తి పేరుతో తీసిన సినిమా రీమేక్‌గా తెరకెక్కిన సినిమాలో ఏకంగా హీరోయే లిక్కర్ సీన్లు చేయడం ఆయనకు నచ్చలేదట. దానితో పాటు కమేడియన్ అలీతో సినిమాలో ఆడవేషం వేయించి తీసిన కామెడీ సీన్లు కూడా ఆయనకు అసంతృప్తి కలిగించాయట.