: ముంబైకి మకాం మారుస్తున్న ధోనీ
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ముంబైకి మకాం మారుస్తున్నాడు. అంధేరి ప్రాంతంలోని హౌసింగ్ సొసైటీలో నాలుగు ఫ్లాట్లను ధోనీ కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ధోనీ తన కుటుంబంతో కలిసి సొంత రాష్ట్రం జార్ఖండ్ రాజధాని రాంచీలోని హర్ము హౌసింగ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. మరో విషయం ఏమిటంటే... ధోనీ మారుతున్న హౌసింగ్ సొసైటీ పేరును 'ధోనీ వ్యాలీ'గా స్థానిక బ్రోకర్లు మార్చాలనుకుంటున్నట్టు సమాచారం. ధోనీ మారుతున్న హౌసింగ్ సొసైటీలోనే బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రభుదేవా, విపుల్ షా, చిత్రాంగద సింగ్, ప్రాచి దేశాయ్ తదితరులు ఉంటున్నారు.