: భ్రమరాంబ థియేటర్లో బాలయ్య హల్ చల్


తన 100వ సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' విడుదల సందర్భంగా కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. అభిమానులతో కలసి ఆయన సినిమాను వీక్షించారు. బాలయ్య రాకతో థియేటర్ వద్ద సందడి నెలకొంది. బాలయ్యను చూడ్డానికి అభిమానులు ఎగబడ్డారు. బాలయ్య కూడా తన అభిమానులందరికీ అభివాదం చేశారు. రెండు వేళ్లతో విక్టరీ సింబల్ చూపుతూ అభిమానులను హుషారెత్తించారాయన. బాలయ్యతో పాటు దర్శకుడు క్రిష్, మరో దర్శకుడు రాజమౌళి, కథానాయిక శ్రియ తదితరులు సినిమాను చూశారు. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ, సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటం ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. 

  • Loading...

More Telugu News