: అధ్యక్ష ఎన్నికలను రష్యా హ్యాక్ చేసి ఉండొచ్చు... చిట్టచివరికి ట్రంప్ నోట అంగీకారం!


అమెరికా అధ్య ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి, ఎన్నికల ప్రక్రియను రష్యా హ్యాక్ చేసిందని వస్తున్న వార్తలపై ఒక్క మాట కూడా మాట్లాడని డొనాల్డ్ ట్రంప్, చివరికి అది నిజమయ్యే ఉండవచ్చని అన్నారు. ఇదే సమయంలో రష్యా హ్యాకింగ్ కారణంగానే తాను విజయం సాధించానన్నది మాత్రం అవాస్తవమని, ప్రజల మద్దతుతోనే తాను గెలిచానని చెప్పారు. డీఎన్సీ (డెమోక్రటిక్ నేషనల్ కమిటీ) సర్వర్ హ్యాక్ అయ్యుండవచ్చని అన్నారు. అమెరికన్లను, ఇక్కడి కంప్యూటర్లను ఒక్క రష్యా మాత్రమే టార్గెట్ చేసిందని భావించలేమని, మరిన్ని దేశాలు దీని వెనుక కుట్ర చేశాయన్న అనుమానం ఉందని అన్నారు. డీఎన్సీ సర్వర్లలో సరైన రక్షణాత్మక వ్యవస్థ లేదని, సైబర్ సెక్యూరిటీ లోపాల వల్లే హ్యాంకింగ్ సాధ్యమైందని అన్నారు.

  • Loading...

More Telugu News