: ఇక వాట్సాప్ ద్వారా పెళ్లిళ్లు.. మెసేజింగ్ యాప్‌లో మ్యాట్రిమోనీ.. సౌదీ అధికారుల విశాల హృద‌యం!


ప్ర‌ముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ వాట్సాప్ సాయంతో ఇక  పెళ్లిళ్లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. ఇందుకోసం సౌదీ అధికారులు కొందరు మెసేజింగ్ యాప్‌లో మ్యాట్రిమోనీ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. సౌదీలో విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో విడాకులు తీసుకుని ఒంట‌రిగా ఉంటున్న మ‌హిళ‌ల‌కు కొత్త జీవితాన్ని ప్ర‌సాదించాల‌ని భావించిన సౌదీకి చెందిన ఎనిమిది మంది అధికారులు విశాల హృద‌యంతో ఆలోచించి పాలిగ‌మీ పేరిట వాట్సాప్‌లో ప్ర‌త్యేకంగా ఓ గ్రూపును క్రియేట్ చేసి మ్యాట్రిమోనీని అందుబాటులోకి తెచ్చారు. ఇందులో విడాకులు తీసుకున్న వారు, వివాహం కానివారు, భ‌ర్త‌ను పోగొట్టుకున్న‌వారు త‌మ పేర్లు న‌మోదు చేసుకోవ‌చ్చు. విశేషం ఏమిటంటే, అందుబాటులోకి వ‌చ్చిన కొన్ని రోజుల్లోనే మొరాకో, సిరియా, యెమ‌న్‌, చైనా, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌కు చెందిన దాదాపు 900 మంది మ‌హిళ‌లు ఈ గ్రూపులో త‌మ పేర్లు న‌మోదు చేసుకున్నారు. వీరిలో 18 నుంచి 55 ఏళ్ల వ‌య‌సున్న వారే ఎక్కువ‌మంది ఉన్నారు.

  • Loading...

More Telugu News