: 2019లోనే కాదు.. 2090లోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు.. తేల్చిచెప్పిన వెంక‌య్య‌


2019లోనే కాదు క‌దా, 2090లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాలేద‌ని కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు తేల్చి చెప్పారు. వ‌చ్చే 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ జ‌య‌కేత‌నం ఎగుర‌వేస్తుంద‌ని, ఢిల్లీ పీఠం త‌మ‌దేన‌న్న‌ కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్య‌ల‌పై వెంక‌య్య స్పందించారు. రాహుల్ ప‌గ‌టి క‌ల‌ల్లో విహ‌రిస్తున్నార‌ని అన్నారు. రాహుల్ వ్యాఖ్య‌ల‌కు తాను ఆశ్చర్యపోయాన‌న్నారు. దేశానికి కాంగ్రెస్ ఏం చేసింద‌ని తిరిగి అధికారంలోకి వ‌స్తుంద‌ని ప్ర‌శ్నించారు. అధికారంలో ఉండ‌గా కుంభ‌కోణాల‌తో దేశాన్ని దోచుకున్న కాంగ్రెస్ ఎప్ప‌టికీ అధికారంలోకి రాలేద‌న్నారు. '2019 గురించి మ‌ర్చిపోండి, 2090లో కూడా మీరు అధికారంలోకి రాలేరు' అని వెంక‌య్య విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News