: సంక్రాంతికి మరిన్ని స్పెషల్ రైళ్లు... సమయ వివరాలు!
సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు మొత్తం 13 ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాల మధ్య నడిపించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. నేటి సాయంత్రం 4:30 గంటలకు కాకినాడ పోర్ట్ - తిరుపతి మధ్య, రాత్రి 10:30కి నాందేడ్ - కాకినాడ పోర్ట్, రాత్రి 10:15కు హైదరాబాద్ - తిరుపతి మధ్య రైళ్లు నడుస్తాయని, రేపు సాయంత్రం 5:50కి మధురై - విజయవాడ మధ్య, సాయంత్రం 6:30కి భీమవరం మీదుగా కాకినాడ పోర్ట్ - సికింద్రాబాద్ కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు.
వీటితో పాటు 15వ తేదీన రాత్రి 7 గంటలకు తిరుపతి - కాకినాడ పోర్ట్, 8:15కు హైదరాబాద్ - విశాఖ, 10:30కి కాకినాడ పోర్ట్ - సికింద్రాబాద్ మధ్య, 16న రాత్రి 7:15కు సికింద్రాబాద్ - కాకినాడ పోర్ట్, ఉదయం 7 గంటలకు విజయవాడ - మధురై, రాత్రి 7:30కి సికింద్రాబాద్ - తిరుపతిల మధ్య రైళ్లు ఉంటాయని ద.మ.రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది.