: నేడు ఏపీకి 750 తెలంగాణ బస్సులు... ఏ బస్సులు ఎక్కడి నుంచంటే..!


సంక్రాంతి సందర్భంగా స్వస్థలాలకు వెళ్లే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేందుకు నేడు 750 బస్సులను సిద్ధం చేశామని, ఇవి వివిధ ప్రాంతాలకు వెళ్తాయని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది. తదుపరి వారం రోజుల వ్యవధిలో మొత్తం 2,430 స్పెషల్ సర్వీసులను నడపనున్నట్టు పేర్కొంది. ఎంజీబీఎస్ నుంచి అనంతపురం, నెల్లూరు, ఒంగోలు, కర్నూలు, కడప, చిత్తూరు, తిరుపతి ప్రాంతాలకు బస్సులు వెళ్తాయని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో ఎల్ బీ నగర్ నుంచి విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాలకు బస్సులు ఉంటాయని, జేబీఎస్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాలకు, ఉప్పల్ నుంచి వరంగల్ వైపు బస్సులు నడపనున్నామని, ఈ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు చెల్లించాల్సి వుంటుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News