: క్షమాపణలు కోరతారా? వీసా రద్దు చేయమంటారా?: అమెజాన్ కు సుష్మా స్వరాజ్ హెచ్చరిక


భారత జాతీయ పతాకాన్ని ముద్రించిన డోర్ మ్యాట్ లను విక్రయిస్తున్న అమెజాన్ సంస్థ, తక్షణం వాటిని మార్కెట్ నుంచి వెనక్కు తీసుకోవాలని, లేకుంటే ఇక్కడ ఆ సంస్థ ప్రతినిధులందరి వీసాలనూ రద్దు చేస్తామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెడుతూ, "అమెజాన్ సంస్థ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. మా దేశ పతాకం ఉన్న అన్ని రకాల ప్రొడక్టుల విక్రయాలను నిలిపివేయాలి. ఈ పని చేయకుంటే, అమెజాన్ అధికారులెవ్వరికీ వీసాలు జారీ చేయము. గతంలో ఇచ్చిన వీసాలనూ రద్దు చేస్తాం" అన్నారు.

కాగా, సుష్మా స్వరాజ్ ట్వీట్ చేసిన నాలుగు గంటల్లోనే అమెజాన్ కేటలాగ్ నుంచి అభ్యంతరకర ప్రొడక్టులను ఆ సంస్థ తొలగించింది. సెర్చ్ రిజల్ట్స్ నుంచి కూడా వాటిని తొలగించింది. ఈ ప్రొడక్టులను తాము డైరెక్టుగా విక్రయించడం లేదని, వాటిని థర్డ్ పార్టీ సెల్లర్స్ తమ వెబ్ సైట్ మాధ్యమంగా విక్రయిస్తున్నారని వివరణ ఇచ్చింది. అంతకుముందు ఓ ట్విట్టర్ యూజర్, ఈ విషయాన్ని సుష్మ దృష్టికి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News