: నేను ఢిల్లీ వీడను.. పంజాబీనే పంజాబ్ సీఎం.. తేల్చి చెప్పిన కేజ్రీవాల్!
ఢిల్లీ ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికల్లో పంజాబ్ సీఎం అభ్యర్థి అంటూ ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా చేసిన సంచలన వ్యాఖ్యలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. తాను ఢిల్లీని వీడేది లేదని, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే పంజాబీనే సీఎం అవుతారని స్పష్టం చేశారు. మనీశ్ సిసోడియా వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీలు విరుచుకుపడ్డాయి. హరియాణా వ్యక్తి పంజాబ్ సీఎం అభ్యర్థి ఏంటంటూ దుమ్మెత్తిపోయడంతో కేజ్రీవాల్ స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. తాను ఢిల్లీలోనే ఉంటానని, పంజాబ్‌కు ఆప్ తరపున ఎవరు సీఎం అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత మాత్రం తనదేనని వివరించారు.