: దేవుడు కూడా చేయలేని పనులు చేసి చూపిస్తా: ట్రంప్ హామీ


అమెరికాలో నిరుద్యోగులకు దేవుడు కూడా ఇవ్వలేనన్ని ఉద్యోగావకాశాలను ఇచ్చి చూపిస్తానని యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. మెక్సికో సరిహద్దుల్లో భారీ గోడ కట్టేది కూడా నిజమేనని అన్నారు. అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసితీరుతానని అన్నారు. రష్యా వద్ద తన సీక్రెట్స్ ఉన్నాయని వచ్చిన వార్తలపై స్పందిస్తూ, అంతా కట్టుకథని, ఈ తరహా ఆరోపణలు చేసి అధ్యక్షుడిని అవమానిస్తున్నారని విమర్శించారు.

తనంటే గిట్టని వాళ్లు చేస్తున్న ప్రచారాన్ని పట్టించుకోబోనని చెబుతూనే, పిచ్చివాళ్లు తనవెంట పడుతున్నారని అన్నారు. నిఘా సంస్థలు సైతం తనకు వ్యతిరేకంగా ఉన్నాయని, అవే మీడియాకు లీకులిస్తున్నాయని ఆరోపిస్తూ, అదే నిజమైతే, ఆయా సంస్థల చరిత్రలో మాయని మచ్చలు పడ్డట్టేనని అన్నారు. కాగా, తన కుటుంబ సభ్యులు, ప్రధాన అనుచరులతో కలసి ట్రంప్ తొలి మీడియా సమావేశంలో పాల్గొనగా, పలు దేశాల మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News