: తొలి మీడియా సమావేశంలో అరిచి కేకలు పెట్టిన డొనాల్డ్ ట్రంప్!


"మీవన్నీ తప్పుడు వార్తలు.. రాసిందంతా చెత్త. నాపై మీడియాలో వచ్చిన వార్తలన్నీ చూశా. అవన్నీ పిచ్చిరాతలు, అవాస్తవాలు" అని అమెరికా నూతన అధ్యక్షుడిగా ఈ నెల 20న పదవీ బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత తొలిసారిగా మీడియాతో మాట్లాడిన ట్రంప్, రష్యాతో తనకు సంబంధాలు లేవని, పుతిన్ తనను ఇష్టపడుతున్నారంటే, అది అమెరికాకు సానుకూలాంశమేనని అన్నారు. చైనా దూకుడును అడ్డుకుని తీరుతామని స్పష్టం చేసిన ఆయన, పనిలోపనిగా రష్యాపైనా విరుచుకుపడ్డారు. రష్యా సహా కొన్ని దేశాలు అమెరికా కంప్యూటర్లను హ్యాక్ చేసిన మాట నిజమేనని, అయితే, అవి డెమోక్రటిక్ పార్టీ నేషనల్ కమిటీవని ఎద్దేవా చేశారు. రిపబ్లికన్ పార్టీ కంప్యూటర్లు హ్యాకింగ్ కు గురి కాలేదని అన్నారు. తనను ఇబ్బంది పెట్టే ప్రశ్న ఎదురైన ప్రతిసారీ ట్రంప్ ఆవేశంగా మాట్లాడారు. తానింక వ్యాపార కార్యకలాపాల్లో పాలు పంచుకోబోనని, తన వ్యాపార బాధ్యతలను కుమారులకు అప్పగించానని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News