: వెనకడుగు వేసే ప్రశ్నే లేదు.. ‘జల్లికట్టు’ నిర్వహించి తీరుతాం: పన్నీరు సెల్వం
పొంగల్ సందర్భంగా జల్లికట్టు క్రీడను నిర్వహించేలా చూస్తామని తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం మరోమారు స్పష్టం చేశారు. ఈ విషయమై వెనకడుగు వేసే ప్రశ్నే లేదని, ‘అమ్మ’ ఆశయాలు, అడుగుజాడల్లోనే తమిళనాడు ప్రభుత్వం, తాను నడుస్తామని అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షపార్టీ డీఎంకేపై ఆయన మండిపడ్డారు. జల్లికట్టు నిషేధం విషయమై ఆ పార్టీ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. జల్లికట్టుపై ఎందుకు నిషేధం విధించారో ప్రజలకు తెలుసని, డీఎంకే నేత స్టాలిన్ చెప్పే మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. కావేరి జలాలు, రిటైల్ రంగాల్లో ఎఫ్ డీఐలు, జల్లికట్టు అంశాలపై ప్రభుత్వం తమ హక్కుల కోసం పోరాడుతుందని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు.