: ప్లాట్ ఫాంపై రద్దీ తగ్గించేందుకే టిక్కెట్ల ధర పెంచాం: రైల్వే అధికారి


సికింద్రాబాద్, కాచిగూడ, విశాఖపట్నం రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టిక్కెట్ల ధర పెంచడానికి గల కారణాన్ని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్ వెల్లడించారు. ప్రయాణికులతో పాటు ఇతరులు కూడా భారీ సంఖ్యలో రైల్వే స్టేషన్లలోకి రావడంతో రద్దీ విపరీతంగా పెరిగిపోతోందని, ప్లాట్ ఫాంపై రద్దీని తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. పెరిగిన   ప్లాట్ ఫాం టిక్కెట్ ధరలు ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు అమలులో ఉంటాయని చెప్పారు. సంక్రాంతి పండగ సందర్భంగా రైళ్లలో రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైలు సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. రైళ్లు సకాలంలో గమ్యం చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.  

  • Loading...

More Telugu News