: సీఎం చంద్రబాబుతో స్పీకర్ కోడెల భేటీ
ఏపీ సీఎం చంద్రబాబుతో అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు భేటీ అయ్యారు. అసెంబ్లీ భవన నిర్మాణం, మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు నిర్వహణపై వారు చర్చించారు. ఫిబ్రవరి మొదటి వారానికి అసెంబ్లీ భవనం సిద్ధం కావొచ్చని సీఎంకు కోడెల చెప్పినట్లు సమాచారం. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరిపే అంశం, భవనం అందుబాటులోకి వస్తే ఫిబ్రవరి 15 తర్వాత సమావేశాలు జరిపే అవకాశాలు గురించి వారు చర్చించినట్లు సమాచారం.