: ఢిల్లీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
గోఎయిర్ వేస్ విమానం ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండైంది. వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీ నుంచి భగ్డోగ్రాకు వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ ఎయిర్ కంట్రోల్ కు సమాచారం అందించి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతి కోరాడు. దీంతో వెంటనే విమానాన్ని ల్యాండ్ చేసేందుకు అనుమతించారు. దీంతో విమానం వెనుదిరిగి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఆ సమయంలో విమానంలో 158 మంది ప్రయాణికులు ఉన్నారని విమానాశ్రయాధికారులు తెలిపారు.