: ప్రధాని మోదీపై విచారణ కోరుతూ సుప్రీంలో దాఖలైన పిటిషన్ తిరస్కరణ!


సహారా, బిర్లాల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు గుప్పిస్తూ, ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతూ ఓ ఎన్జీవో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేసింది. ఈ రోజు ఆ పిటిష‌న్ న్యాయస్థానంలో విచార‌ణ‌కు వ‌చ్చింది. అయితే ఆ పిటిష‌న్‌ను సుప్రీకోర్టు తిరస్కరించింది. ఆ వ్యాజ్యానికి విచారణార్హత లేదని పేర్కొంది.  

  • Loading...

More Telugu News