: భారత హాకీ కెప్టెన్ కు దక్కిన అరుదైన గౌరవం!
భారత హాకీ జట్టు కెప్టెన్ పీఆర్ శ్రీజేశ్ కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అథ్లెట్ల కమిటీకి శ్రీజేష్ ఎంపికయ్యాడు. ఎఫ్ఐహెచ్ నిర్ణయ ప్రక్రియలో ఆటగాళ్లు తమ అభిప్రాయాలను చెప్పేందుకు ఈ కమిటీ కృషి చేస్తుంది. సమాఖ్య నిర్ణయాలు తీసుకునే ముందు ఆటగాళ్లను కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకుని ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీకి అందివ్వడమే శ్రీజేశ్ బాధ్యత. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కమిటీకి తాను ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నాడు. హాకీ దిగ్గజం మార్టిజ్ సహా అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్న ఈ కమిటీలో తాను భాగస్వామి కావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు.