: మద్యం మత్తులో కారు నడిపి యాక్సిడెంట్ చేసిన ఇంజనీరింగ్ యువకులు.. ఒకరి మృతి!
మద్యం మత్తులో కారు నడిపి ఒకరి మృతికి కారణమైన నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని జెన్ వాడ వద్ద మద్యం తాగి కారు నడుపుతూ కొందరు యువకులు ఓ ద్విచక్రవాహనాన్ని ఈరోజు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఓ మహిళకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి కారణమైన నలుగురు యువకులూ ఐబీఎం ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు.