: దావోస్ పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 16 నుంచి 20 వరకు ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందని ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. 'రెస్పాన్సివ్ అండ్ రెస్పాన్సిబుల్ లీడర్ షిప్' అనే అంశంపై దావోస్ లో ఏర్పాటు చేసిన సదస్సులో చంద్రబాబు పాల్గొంటారని ప్రభాకర్ వెల్లడించారు. అంతేకాదు, ఏపీ పెవిలియన్ వేదికగా పలువురు పారిశ్రామిక దిగ్గజాలు, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రతినిధులతోనూ చంద్రబాబు భేటీ అవుతారని చెప్పారు. వీటితోపాటు ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసిన 7 సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు. 

  • Loading...

More Telugu News