: నా కుమారుడి సినిమా చాలా బాగుంది: చిరంజీవి తల్లి అంజనాదేవి
చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' చూసి అతని మాతృమూర్తి అంజనాదేవి చాలా ఆనందం వ్యక్తం చేశారు. తన కుమారుడి సినిమా సూపర్ అని ఆమె అన్నారు. ఈరోజు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో ఆమె సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి నటించిన ఖైదీ సినిమా అద్భుతంగా ఉందని తెలిపారు. 60 ఏళ్ల వయసులో కూడా తన నటన, డ్యాన్సులతో చిరంజీవి అదరగొట్టాడని చెప్పారు. అభిమానులందరికి ఇది నిజమైన సంక్రాంతి అని ఆమె అన్నారు.