: న్యాయమూర్తుల కొరత గురించి ప్రస్తావించిన ప్రధాన న్యాయమూర్తి


న్యాయమూర్తుల కొరత అంశాన్ని ఇటీవల కొత్తగా నియమితులైన భారత  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ ఖేహర్ ప్రస్తావించారు. ఓ కేసు విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల ఖాళీల వల్ల సుప్రీం కోర్టు పనితీరుపై ప్రభావం పడుతోందని, 31 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన స్థానంలో కేవలం 23 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారని అన్నారు. కాగా, న్యాయమూర్తుల నియామకం అంశంపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ గతంలో పలుసార్లు ప్రస్తావించారు. న్యాయమూర్తుల కొరత వల్ల జడ్జీలు పనిఒత్తిడి ఎదుర్కొంటున్నారని  ప్రధాని మోదీ హాజరైన నాటి సమావేశంలో ఆయన కంటతడి పెట్టిన విషయం విదితమే.  

  • Loading...

More Telugu News