: చంద్రబాబుకు పాదాభివందనం చేసిన ఎమ్మెల్సీ


తన శపథం నెరవేరడంలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు పాదాభివందనం చేశారు టీడీపీ ఎమ్మెల్సీ  సతీష్ రెడ్డి. సింహాద్రిపురం పైడిపాలెం చెరువులోకి నీళ్లు వస్తేనే గెడ్డం తీస్తానని సతీష్ శపథం చేసిన సంగతి తెలిసిందే. తన కల నెరవేరడంతో తాను చేపట్టిన దీక్షను సతీష్ రెడ్డి విరమించారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ, పైడిపాలెంకు నీరు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో రాయలసీమ రతనాలసీమ అవుతుందని తెలిపారు. 

  • Loading...

More Telugu News