: ఆ రోజు ముసుగులు ధరించి వెళ్లి, పారడైజ్ లో బిర్యానీ తిన్నాం గుర్తుందా?: చిరంజీవితో రోజా


ప్రముఖ నటుడు చిరంజీవితో కలిసి మూడు సినిమాల్లో నటించిన రోజా.. అప్పటి షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంది. నిన్న ఓ టీవీ చానెల్ కోసం చిరంజీవిని ఇంటర్వ్యూ చేసిన రోజా, చిరంజీవితో సినిమా చేస్తే బహుమతిగా సురేఖతో స్నేహం దొరుకుతుందని చెప్పింది. సురేఖ కోసం ఒక రాత్రి సికింద్రాబాద్ లోని పారడైజ్ హోటల్ కి ముసుగులు వేసుకుని వెళ్లి, భోజనం చేసిన రోజులను గుర్తుచేసుకుంది. సురేఖకు పారడైజ్ బిర్యానీ చాలా ఇష్టమని చిరంజీవి చెప్పారు. అలాగే ప్రముఖ నటి శ్రీదేవికి సురేఖ చేసే ఎండు చేపలకూర చాలా ఇష్టమని చిరంజీవి అన్నారు. శ్రీదేవి హైదరాబాదు ఎప్పుడు వచ్చినా అప్పట్లో సురేఖ ఎండుచేపల కూర చేసి పంపేదని ఆయన తెలిపారు. తనతో నటించిన చాలా మంది హీరోయిన్లు సురేఖకు మంచి స్నేహితులయ్యారని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News