: చిరంజీవి సినిమా టికెట్ కోసం బ్లేడుతో కోసుకుని రచ్చ చేసిన వీరాభిమాని!


తన అభిమాన నటుడు చిరంజీవి కొత్త చిత్రం టికెట్ తనకు లభించలేదన్న ఆగ్రహంతో, ఓ వీరాభిమాని రెచ్చిపోయాడు. మద్యం మత్తులో బ్లేడుతో గొంతు కోసుకుని రచ్చ చేశాడు. ఈ ఘటన విశాఖపట్నంలోని రామా టాకీస్ వద్ద కలకలం రేపింది. సదరు అభిమాని మెడకు గాయం కాగా, ఆసుపత్రికి తరలించాలని థియేటర్ యాజమాన్యం ప్రయత్నించింది. చికిత్స చేయించుకునేందుకు వెళ్లేది లేదంటూ, మూర్ఖంగా ప్రవర్తించిన అతను, టికెట్ ఇస్తేనే వెళతానని, లేకుంటే చచ్చిపోతానని అక్కడున్న వారిని హడలెత్తించాడు. చివరికి పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News