: అమెరికాలో బాహుబలి రికార్డుకు 'ఖైదీ' దెబ్బ!
అమెరికాలో విడుదలైన తెలుగు చిత్రాల్లో ప్రీమియర్ షోల కలెక్షన్లలో ఇంతవరకూ బాహుబలి చిత్రం వసూలు చేసిన మొత్తమే ఆల్ టైం రికార్డుకాగా, చిరంజీవి తాజా చిత్రం 'ఖైదీ నంబర్ 150' దాన్ని అధిగమించనుందని తెలుస్తోంది. బాహుబలి విడుదలైన వేళ ప్రీమియర్ షోల ద్వారా 1.35 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 9.02 కోట్లు - ఒక డాలర్ విలువ బుధవారం నాటి ఆర్బీఐ రిఫరెన్స్ రూ. 68.22పై) వసూలు చేసింది. ఇక చిరు చిత్రం ప్రీమియర్ షోలు ఇంకా కొనసాగుతూనే ఉండగా, ఇప్పటికే 1.2 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 8.18 కోట్లు) వసూలైంది. ఇంకా పలు ప్రాంతాల నుంచి కలెక్షన్ల సమాచారం రావాల్సి వుండటంతో, బాహుబలి సృష్టించిన ప్రీమియర్ షో రికార్డులు బద్దలవుతాయని అంచనా.